Site icon Swatantra Tv

కేటీఆర్ పై ఫైరైన బండ్ల గణేష్

బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ పై కాంగ్రెస్‌ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్‌ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రేవంత్ సీఏం కావడంతో కేటీఆర్ బాధపడుతున్నారని అన్నారు. తండ్రి పేరు అడ్డు పెట్టుకునే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. కేసీఅర్ అబ్బాయిగా తప్పా కేటీఆర్ కి ఏ గుర్తింపు లేదన్నారు. రేవంత్ పోరాట యోధుడు అని అన్నారు. బీఆర్ఎస్ పెట్టిన చిత్ర హింసలు, మానసిక క్షోభ అధిగమించి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందని విమర్శించారు. మేడిగడ్డ కూలిపోతే తమదే బాధ్యత అని బీఆర్ఎస్ చెప్పాలని బండ్ల గణేష్‌ డిమాండ్ చేశారు.

Exit mobile version