Site icon Swatantra Tv

ఘనంగా బాలాపూర్ లడ్డూ వేలం.. ఎంత పలికిందంటే!

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఈ సంవత్సరం లడ్డూ వేలంలో 36 మంది పాల్గొన్నారు. ఈసారి రూ.27 లక్షలకు దాసరి దయానంద రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది ధరను ఈసారి వేలం దాటేసింది.

గతేడాది లడ్డూ వేలంలో 24.60 లక్షలు పలికింది. ఈ సంవత్సరం రూ.1,116 నుంచి లడ్డూ వేలం ప్రారంభమైంది. క్రమంగా వేలు, లక్షలూ పెంచుకుంటూ పోయింది. సీఎం రూ.12 లక్షలతో లడ్డూ వేలంలో పాల్గొన్నారు. ఈసారితో లడ్డూ వేలానికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా లడ్డూ వేలం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ లడ్డూ దక్కించుకోవడాన్ని అదృష్టంగా భావిస్తారు భక్తులు. ఇందుకోసం ఎన్ని లక్షలైనా సమర్పించుకునేందుకు భక్తులు వెనకాడరు. ఈ లడ్డూ దక్కించుకునేవారికి ఆ వినాయకుడి కరుణ కటాక్షాలు ఏడాదంతా ఉంటాయని బలంగా నమ్ముతారు.

ఈ లడ్డూని దక్కించుకున్న వారు.. బాలాపూర్ లోని వ్యవసాయ పొలాల్లో దాన్ని చల్లుతారు. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. ఈ లడ్డూ వేలం ద్వారా వచ్చే డబ్బును బాలాపూర్ అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. అందువల్లే ఒకప్పుడు సాధారణ పల్లెటూరిలా ఉండే బాలాపూర్ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతోంది. గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఈ అభివృద్ధికి తగ్గట్టే… వేలంలో లడ్డూ ధర కూడా ప్రతీ సంవత్సరం పెరుగుతోంది.   ఇలా ప్రతీ సంవత్సరం లడ్డూ వేలం వేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ లడ్డూ వేలం తర్వాతే శోభాయాత్ర జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఐతే… ఈ సంవత్సరం లడ్డూ వేలం పాటకి కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ వేలంపాటను విజయవంతంగా ముగించి.. ఇక శోభాయాత్ర ప్రారంభించారు.

Exit mobile version