కమెడియన్ వేణు దర్శకత్వంలో అభిమానుల మనసుల్ని కొల్లగొట్టిన సినిమా ‘బలగం’. తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టేలా రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 3న థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా.. సినీ ప్రేక్షకులతో పాటు, విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా, ఈ సినిమా ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై మార్చి 24 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.