Site icon Swatantra Tv

తల్లికి గుండెపోటు.. విచారణకు రాలేనని సీబీఐకి అవినాశ్ రెడ్డి లేఖ

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నేడు కూడా సీబీఐ విచారణకు హాజరుకాలేదు. తన తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు రావడంతో ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చారని.. అందుకే విచారణకు రాలేనని సీబీఐ అధికారులకు ఆయన లేఖ రాశారు. దీంతో ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని చూసేందుకు హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాశ్ బయల్దేరారు.

ఈనెల 16న కూడా సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని చెబుతూ డుమ్మా కొట్టారు. ఆయన లేఖపై స్పందించిన సీబీఐ నేడు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దాంతో విచారణ కోసం గురువారం పులివెందుల నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. విచారణకు బయలుదేరిన అవినాశ్ దారి మధ్యలో తన తల్లికి అనారోగ్యం అంటూ విచారణకు రాలేనని పేర్కొంటూ పులివెందుల వెళ్లారు. మరి అవినాశ్ విచారణ డుమ్మాపై సీబీఐ ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవిండి: కాసేపట్లో సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి

Exit mobile version