Site icon Swatantra Tv

అవినాశ్ బెయిల్ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపడతామని పేర్కొంది. వాదనలు వినిపించడానికి తమకు రేపటి దాకా సమయం కావాలని అవినాశ్ తరపు న్యాయవాది కోరడంతో విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. కాగా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మంగళవారమే హైకోర్టు విచారించాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందకపోవడంతో విచారణను బుధవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా పులివెందుల నుంచి కడపకు చేరుకున్న అవినాశ్‌రెడ్డి వైసీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

Exit mobile version