స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. వాదనలు విన్న వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం.లక్ష్మణ్ బుధవారానికి తీర్పును వాయిదా వేశారు. అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దని అవినాష్ రెడ్డి కోరగా.. హై కోర్టు దానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఎంపీ అవినాష్ రెడ్డి, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించగా.. నేడు సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు.