Site icon Swatantra Tv

సిరీస్ డిసైడ్ మ్యాచ్ లో భారత్ ముందు భారీ టార్గెట్

చెన్నై వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ట్రావిస్‌ హెడ్‌(33), మిచెల్ మార్ష్‌ (47), అలెక్స్‌ కెరీ (38)పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, కుల్‌దీప్‌ పాండ్య చెరో మూడు వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మొదటి వన్డేలో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. రెండో వన్డేలో ఓటమిపాలైంది. మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్‌ని 2-1 తేడాతో కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

Exit mobile version