Site icon Swatantra Tv

మాస్కోపై ముష్కరుల దాడి…..దొరికిన నిందితులు

   రష్యాలోని మాస్కోపై దాడి చేసిన ముష్కరులను రష్యా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. ఉగ్రవాదు లను కోర్టులో హాజరుపరచగా డబ్బు కోసమే ప్రజలపై కాల్పులు జరిపినట్లు నింది తుల్లో ఒకరు ఒప్పుకున్నారు. దీంతో వారికి కోర్టు మే 22 వరకు కస్టడీ విధించింది. మొత్తం ఏడుగురు అనుమానితులను అరెస్టు చేయగా, వారిలో నలుగురే దలెర్ద్‌జొన్‌ మిర్జొయెవ్‌, సైదక్రామి రచబలిజొద, షంసిదున్‌ ఫరీదుని, ముఖమ్మద్‌సొబిర్‌ ఫైజొవ్‌.

    తీవ్ర గాయాలతో కనిపించిన ముగ్గురూ నేరాన్ని అంగీకరించగా, నాలుగో వ్యక్తి అసలు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. డబ్బు కోసమే ప్రజలపై కాల్పులు జరిపినట్లు నిందితుల్లో ఒకరు వెల్లడించారు. అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసాన్‌ ఉగ్రముఠాకు చెందినవారిగా రష్యా అనుమా నిస్తోంది. దాడులకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులే కారణమని నమ్మడానికి ఆధారాలుంటే ఇవ్వాలని రష్యా అమెరికాను కోరింది.ఉగ్రదాడికి పాల్పడినవారు అతివాద ఇస్లామిస్టులని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తాజాగా ఆరోపించారు. ఇస్లామిక్‌ అతివాదులు ఏ భావజాలంతో పనిచేస్తున్నారో దానికి అనుగుణంగానే వీరూ ఘాతుకానికి తెగబడ్డారని ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌ వైపు పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నించారో, వారి కోసం అక్కడ ఎవరు నిరీక్షిస్తు న్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. మాస్కోపై దాడి పెను విషాదాన్ని నింపింది. ముష్కరుల దాడితో రష్యా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశ రాజధానిలోని ఓ సంగీత కచేరీపై విరుచుకుపడి పెద్దఎత్తున ప్రజల ప్రాణాలు బలిగొ న్నారు దుండగులు.

Exit mobile version