Site icon Swatantra Tv

ఎన్నికలవేళ.. పుల్వామాలో 144 సెక్షన్

దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నవేళ.. పుల్వామా జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా 144 సెక్షన్ విధించడాన్ని పిడిపి చీఫ్, అనంతనాగ్ – రజోరీ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థి మహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. పీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని… వేధిస్తున్నారని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన చర్యలు లేవన్నారు మహబూబా ముఫ్తి. భారత ఎన్నికల సంఘం 87లో ఏం జరిగిందో అదే పునరావృతం చేయాలనుకుంటే ఈ ఎన్నికల డ్రామా ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా వారు ఏర్పాటు చేసిన ప్రాక్సీ గ్రూపులకు అండగా నిలుస్తోందని ఆమె ఆరోపించారు. అనంతనాగ్ – రజోరీ స్థానంలో ఎన్నిక వాయిదా వేయడానికి ఎన్డీఏ కుట్రలే కారణమని మహబూబా ఆరోపించారు.

Exit mobile version