Site icon Swatantra Tv

అప్పట్లో జగన్‌ నాపై దాడి చేయించారు- మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. వైసిపి ప్రభుత్వంలో భీమవరంలో పాదయాత్ర చేసినప్పుడు తనపై అప్పటి ముఖ్యమంత్రి జగన్, అప్పటి ఎమ్మెల్యే దాడి చేయించారని అన్నారు. తనపై దాడి జరిగిన ప్రదేశంలోనే గతంలో పవన్ కళ్యాణ్ అన్నపై కూడా దాడి జరిగిందని చెప్పారు. రాత్రికి రాత్రి ఆనాడు తమ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు తరలించి జైలుకు పంపించారని ఆరోపించారు.

కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు ఉండవు. గతంలో వైసిపి ప్రభుత్వానికి 151 సీట్లు వస్తే గతేడాది జరిగిన ఎన్నికలలో 11 సీట్లు మాత్రమే వచ్చాయి. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలి. కూటమిని విడదీసే పనిలో సైకో జగన్ ఉన్నారు. మనమందరం బూత్ లెవెల్ నుండి జాతీయస్థాయి వరకు అప్రమత్తంగా ఉండాలి.. అని లోకేశ్‌ అన్నారు. భీమవరంలో పర్యటించిన లోకేశ్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Exit mobile version