శాంతి భద్రతలు కాపాడాల్సిన ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు విధినిర్వహణను మరిచిపోయి మందుబాబులతో కలిసి మద్యం సేవించటం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలం శంకరా పురంలో ఈ ఘటన జరిగింది. రాజకీయ కక్షల నేపథ్యంలో జరుతున్న దాడులను అరికట్టేందుకు గ్రామం లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆ డ్యూటీలో వచ్చిన ఒక ఏఎస్ఐ పార్టీ నేతలతో కలిసి యూనిఫాం తోనే మందుకొట్టాడు. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన వారు సోషల్ మీడియాలో షేర్ చెయ్యటంతో జిల్లాలో దుమారం చెలరేగింది. ఏఎస్సైను వీఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు.