Site icon Swatantra Tv

ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 119 నియోజకవర్గాలకుగాను 119 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పరిధిలో 15చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడు అంచెల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్ రూమ్‌లకు ఒకే ద్వారం నుండి ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే స్ట్రాంగ్ రూమ్‌లకు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసింది.

ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్‌ను ఏర్పాటు చేసింది. ఎక్కువగా పోలింగ్ కేంద్రాలున్న నియోజకవర్గల ఓటింగ్ లెక్కింపుకు అధికంగా టేబుల్స్ ఏర్పాటు చేసింది. పోస్టల్ బ్యాలెట్స్ కోసం ప్రత్యేక టేబుల్స్‌ను ఏర్పాటు చేసింది. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. 119 నియోజకవర్గాల్లో సుమారు 2.50 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ జారీ అయ్యాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Exit mobile version