Site icon Swatantra Tv

జ‌న‌సేన పార్టీ స‌భ్యత్వ న‌మోదులో తిరుప‌తిని రాష్ట్రంలోనే నంబ‌ర్ వ‌న్‌గా నిల‌పాలి – ఆరణి శ్రీనివాసులు

జ‌న‌సేన పార్టీ స‌భ్యత్వ న‌మోదులో తిరుప‌తిని రాష్ట్రంలోనే నంబ‌ర్ వ‌న్‌గా నిల‌పాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. స‌భ్యత్వ న‌మోదులో స్నేహితులు, బంధువుల‌ను ప‌క్కన పెట్టి నిజ‌మైన కార్యక‌ర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. జ‌న‌సేన పార్టీ స‌భ్యత్వం ఈనెల 28వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో స‌న్నాహ‌క స‌మావేశం నిర్వహించారు. జ‌న‌సేన పార్టీ ఆవిర్బావం త‌రువాత నాలుగో ద‌ఫా జ‌రుగుతున్న స‌భ్యత్వ నమోదులో మ‌హిళ‌ల‌కు నాయ‌క‌త్వంలో భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని ఆయ‌న నాయ‌కుల‌కు సూచించారు. డివిజ‌న్‌కు ఒక నాయ‌కుడుతో పాటు నాయ‌కురాలుకు స‌భ్యత్వ నమోదు బాధ్యత‌లు ఇవ్వాలన్నారు. ప్రతి ఎన్నికలో జ‌న‌సేన జెండా ఎగుర‌వేసేలా నాయ‌క‌త్వాన్ని తీర్చిదిద్దేందుకు అందురూ స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు.

Exit mobile version