తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 17 మంది డ్రగ్ ఇనస్పెక్టర్లకు నియామక పత్రాలను తెలంగాణ మంత్రి దామోదర్ రాజనర్సింహ అందజేశారు. నకిలీ మందుల తయారీని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాజనర్సింహ చెప్పారు. నకిలీ మందుల నివార ణలో భాగంగా నిరంతరం పర్యవేక్షణ కోసం కొత్తగా డ్రగ్ ఇనస్పెక్టర్లను ప్రభుత్వం నియమించిందని తెలి పారు. నియామక పత్రాలు అందుకున్న వారికి మంత్రి దిశానిర్దేశం చేశారు. సమాజహితం కోసం విధుల ను బాధ్యతగా నిర్వహించాలని డ్రగ్ ఇనస్పెక్టర్లకు రాజనర్సింహ సూచించారు.
కొత్త డ్రగ్ ఇనస్పెక్టర్లకు నియామక పత్రాలు
