Site icon Swatantra Tv

మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న రోజా.. కేక్ కట్ చేసి…

Minister Roja

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఆర్‌కే రోజా(Minister Roja) ఆనందం వ్యక్తం చేస్తూ.. సిబ్బంది, అధికారులకి శుభాకాంక్షలు తెలిపారు. సంవత్సరకాలంలో అనేక పనులు చేశామని.. దీనికి సహకరించిన మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ… `ఒంటరిగా మనం చాలా తక్కువ చేయగలం.. కలిసి మనం చాలా చేయగలం.’ అని క్యాప్షన్ ఇచ్చారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా విజయవాడలోని మంగళవారం బెర్మ్‌ పార్కులో ఆమె కేక్‌ కట్‌ చేసి అధికారులతో పంచుకున్నారు. ఈ మేరకు రోజా(Minister Roja) మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్(Jagan) ఆశీస్సులతోనే మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నానని అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం వాస్తవమేనని అన్నారు. మన ఆటగాళ్లు బెంగళూరు(Bangalore), హైదరాబాద్‌(Hyderabad) వెళ్లి రావడం బాదేస్తుందని అన్నారు. ఇక క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా… రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులతో క్రీడారంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

టూరిజానికి సంబంధించి గడిచిన సంవత్సరంలో ప్రతిష్టాత్మక పర్యటనలు, సదస్సుల్లో పాల్గొనడంతో పాటు.. ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, జీ20 సమ్మిట్ లో కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. త్వరలో టెంపుల్ టూరిజంతోపాటు విశాఖలో నేచురల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. టెంపుల్ టూరిజంలో దేశంలోనే మూడవ స్థానంలో ఏపీ ఉండటం గర్వించదగ్గ విషయం అని అన్నారు.

Read Also:  బండి సంజయ్ ఆరోపణలకు వరంగల్ సీపీ స్ట్రాంగ్ కౌంటర్
Follow us on:  YoutubeInstagram Google News

Exit mobile version