Site icon Swatantra Tv

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. అక్టోబర్‌ 3 నుంచి 21వ వరకు టెట్‌ పరీక్షలు జరగ్గా.. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్‌ 29న తుది కీ విడుదల చేసింది. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌కు 4లక్షల 27వేల 300 మంది దరఖాస్తు చేసుకోగా.. 3లక్షల 68వేల 661 మంది హాజరయ్యారు.

తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 2న టెట్‌ ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. తుది ‘కీ’ వెల్లడిలో జాప్యం జరగడంతో ఫలితాల ప్రకటన వాయిదా పడింది. మెగా డీఎస్సీకి సంబంధించి 16వేల 347 పోస్టులతో ఈ నెల 6న ప్రకటన విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రకటన విడుదల తేదీ నుంచి నెలరోజుల పాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు.

Exit mobile version