Site icon Swatantra Tv

నేడు ప్రారంభమైన జగనన్న సురక్ష కార్యక్రమం

స్వతంత్ర వెబ్ డెస్క్: నేడు ఏపీలో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభమైంది. నెలరోజుల పాటు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం జరగనుంది. ఈ పథకంలో భాగంగా నేటి నుంచి పార్టీ నేతలు, గృహ సారథులకు శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే నెల 1 నుంచి ఇంటింటికీ కేడర్‌ తిరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.. ఈ కార్యక్రమాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తారు.. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేయడమే ఈ శిబిరాల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రేషన్‌ కార్డులు, పెన్షన్ల కోసమే గతంలో ఉద్యమాలు జరిగేవని.. అలాంటిది తాము ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలు అందించగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. అయితే.. ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ క్యాంపు ద్వారా ప్రతి పౌరుడి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది..ప్రతి కుటుంబం యొక్క పథకాలు, పత్రాల సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది.. వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సురక్షా గురించి అవగాహన కలిపిస్తారు.. అంటే రాష్ట్రంలోని 1.6 కోట్ల కుటుంబాల వద్దకే అధికారులు వెళ్లనున్నారు.. ఈ సురక్షా క్యాంపులు 15 వేల సచివాలయాల్లో నిర్వహించనున్నారు.. ముందుగా గుర్తింపబడిన పత్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ప్రతి సచివాలయంలో ఒక రోజు క్యాంపు నిర్వహిస్తారు.. 100 శాతం అర్హులను ప్రభుత్వ పథకాల్లో చేర్చడం, పత్రాల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం యొక్క టార్గెట్‌.

ఈ నాలుగేళ్లలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో నెలరోజులపాటు ‘జగనన్నకి చెబుదాం’ కార్యక్రమానికి కొనసాగింపుగా.. జగనన్న సురక్ష కార్యక్రమం జరగనుంది. ప్రతీ సచివాలయంలోనూ క్యాంప్‌ నిర్వహించేలా ఏర్పాటు చేశారు. దీనికోసం 1902 హెల్ప్‌డెస్క్‌ కూడా ఏర్పాటు చేశారు. సమస్యలేవైనా ఉంటే ఈ నెంబర్‌కు డయల్‌ చేయొచ్చు.

Exit mobile version