Jagan Delhi Tour |ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించిన విషయం తెలిసిందే. రెండు వారాల వ్యవధిలో మరోసారి జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన అంశంపై కేంద్ర హోంమంత్రితో చర్చించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి పర్యటన(Jagan Delhi Tour)లో అజెండా ఏమిటి.. ఏయే అంశాలపై కేంద్ర హోమంత్రిని కలవనున్నారనే దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను నివేదించడానికే జగన్ ఢిల్లీ పర్యటన అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాని రెండు వారాల వ్యవధిలో రెండోసారి ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటనకు వెళ్లనుండటంపై ఏపీ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.
Read Also: రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లపై కేటీఆర్ రూ.100కోట్ల పరువునష్టం దావా
Follow us on: Youtube, Instagram, Google News