Site icon Swatantra Tv

రైతు వ్యతిరేక రేవంత్ సర్కార్‌కు శిక్ష తప్పదు- సంపత్‌రావు

   రైతు వ్యతిరేక పాలన చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని కరీంనగర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు అన్నారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, గద్దెనెక్కిన తర్వాత వాటిని విస్మరించారని సంపత్‌రావు దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం లో రేవంత్‌ సర్కార్‌ ఫెయిలైందన్నారు. అమలు కాని 6 గ్యారంటీలు ఇచ్చిన రేవంత్‌ తప్పించు కుంటు న్నారని సంపత్‌రావు మండిపడ్డారు.

Exit mobile version