Site icon Swatantra Tv

నేటి నుండి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ షురూ.. గెస్ట్ గా హీరోయిన్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (APL) రెండో సీజన్‌కు నేటి నుండి షురూ కానుంది. ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ACA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ లీగ్‌లో ఆరు జట్లు కోస్టల్‌ రైడర్స్‌, బెజవాడ టైగర్స్‌, వైజాగ్‌ వారియర్స్‌, రాయలసీమ కింగ్స్‌, మార్లిన్‌ గోదావరి టైటాన్స్‌, కేవీఆర్‌ ఉత్తరాంధ్ర లయన్స్‌ పోటీపడుతున్నాయి. వైజాగ్‌ స్టేడియంలో మొదలయ్యే ఈ లీగ్‌కు టాలీవుడ్‌ నటి శ్రీలీల(Heroine Srileela) గౌరవ అతిథిగా హాజరుకానుంది.
ఇక, టీమిండియా స్టార్లు హనుమ విహారి(Hanuma Vihari), శ్రీకర్‌ భరత్‌(Srikar Bharath) లీగ్‌లో ప్రధాన ఆకర్షణ కానున్నారు. రాయలసీమ కింగ్స్‌కు విహారి, ఉత్తరాంధ్ర లయన్స్‌కు భరత్‌, కోస్టల్‌ జట్టుకు రషీద్‌ ఆడుతున్నారు. కాగా, స్టేడియంలో మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. తొలి మ్యాచ్‌ కోస్టల్‌ రైడర్స్‌, బెజవాడ టైగర్స్‌ జట్ల మధ్య జరుగుతుంది. మ్యాచ్‌లు స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానున్నాయి.
Exit mobile version