40.2 C
Hyderabad
Thursday, April 25, 2024
spot_img

Sajjala : అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అంతకంటే ఘోరం మరొక్కటి ఉండదు

Sajjala : వివేకా హత్య కేసులో సీబీఐ(CBI) విచారణ తుది దశకు వచ్చిన సమయంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ రిపోర్టును సీబీఐ ఎందుకు పక్కన పెట్టిందని.. చంద్రబాబు(Chandrababu) దర్శకత్వంలోనే విచారణ జరుగుతుందని ఆరోపించారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బీటెక్ రవి, చంద్రబాబు ఫోన్ రికార్డింగులు ఎందుకు పరిశీలించడం లేదని ఆయన ప్రశ్నించారు. గూగుల్ టేక్ఔట్ అనే  టెక్నాలజీ గురించి కొత్తగా వింటున్నామని.. సీబీఐ దగ్గర సరైన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సజ్జల డిమాండ్ చేశారు. ఈ కేసును జగన్(Jagan) మెడకు చుట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనపడుతోందన్నారు. వివేకా హత్య కేసులో అసలైన కుట్రదారులను అరెస్ట్ చేయాలని.. ఈ కేసుతో సంబంధం లేని అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అంతకన్నా ఘోరం మరొక్కటి ఉండదన్నారు సజ్జల(Sajjala).

Read Also: గ్రేటర్ మేయర్ గదిలోకి ఐదువేల కుక్కలను పంపాలి: RGV

Latest Articles

కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు

 ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తునకు సహకరించకుండా మొండిగా ప్రవర్తించినందువల్లే అరెస్ట్ కు దారితీసిందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. కేజ్రీవాల్ అరెస్ట్ కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్