స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు ప్రయత్నించిన తెలుగు యువకుడు సాయి వర్షిత్ కందులకు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది. శిక్షతో పాటు భారత కరెన్సీలో రూ.2కోట్లు జరిమానా విధించవొచ్చని తెలుస్తోంది. ఫెడరల్ కోర్టు ఎదుట వర్షిత్‌ను పోలీసుటు హాజరుపరచగా మే30 దాకా కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలోని మిసోరి రాష్ట్రానికి చెందిన సాయి వర్షిత్ గత సోమవారం ఓ ట్రక్కులో వైట్ హౌస్ వద్ద బైడెన్ హత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సాయిని అదుపులోకి తీసుకుని నాజీల జెండాను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపటం, అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నడం లాంటి అభియోగాలను వర్షిత్‌పై పోలీసులు నమోదు చేశారు. ఈ నేరాలకు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశమున్నట్లు చెప్పిన న్యాయమూర్తి వచ్చే వారానికి తదుపరి విచారణను వాయిదా వేశారు.