29.2 C
Hyderabad
Monday, May 29, 2023

విద్యార్థినిలతో ప్రధానోపాద్యాయుడు కీచక చేష్టలు.. పుట్టు మచ్చలు చూపించమంటూ..

ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో ఓ ప్రధానో పాధ్యాయుడి అరాచకాలు ఆసల్యంగా వెలుగులోకి వచ్చాయి. తనకల్లు మండలం నల్లగుట్లపల్లి జల్లా పరిషత్‌ ప్రధానోపాధ్యాయుడు ఆదినారాయణ పాఠశాలలో బాలికలకు గత కొద్దిరోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ నరకం చూపిస్తున్నాడు. ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపులకు విద్యార్థినులు చాలాకాలంగా తమలో తామే కుమిలిపోయారు. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ కూడా ఆదినారాయణ అమ్మాయిల పట్ల అరాచక చేష్టలకు పాల్పడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒంటిపై పుట్టుమచ్చలు చూపించాలంటూ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తోంటే అమ్మాయిలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తాము కుమిలిపోయారు.

చివరికి డీఈఓ మీనాక్షికి చెప్పుకోవడంతో ఆమె చర్యలు తీసుకున్నారు. పాఠశాలలో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయనీ, ప్రధానోపాధ్యాయుడు సహా మరికొందరిపై చర్యలు తప్పవన్నారు. అయితే ఈ దరిద్రపు చర్యకు అక్కడ పనిచేస్తున్న మహిళా టీచ్లు సైతం ప్రధానోపాధ్యాయుడికి సహకరిస్తుండడం సిగ్గుచేటని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు చేసిన పనికి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆదినారాయణను సస్పెండ్‌ చేశారు అధికారులు. అతన్ని సెక్షన్ 354(D), సెక్షన్ 7,8,11,12 ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Latest Articles

వీధి కుక్కల దాడితో మరో బాలుడు బలి

స్వతంత్ర వెబ్ డెస్క్: మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య కాలంలో వీధి కుక్కలు ఒక రేంజిలో రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా అవి చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని చాలా దారుణంగా దాడి చేస్తున్నాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్