37.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

‘మా ఇంట్లో ఓట్లు అమ్మడం లేదు’ అంటూ ఫ్లెక్సీ

Vote for not Sale: రేపు ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. అయితే కొంతమంది ఓటర్లు తమ ఓటును అమ్ముకునేందుకు ఇష్టపడడం లేదు. ఇలాంటి ఘటనే అనంతపురంలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నల్లపల్లి విజయభాస్కర్.. ‘మా ఇంట్లో ఓట్లు అమ్మడం లేదు’ అంటూ తన ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటును అమ్ముకొని తమ ఆత్మగౌరవాన్ని, ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టలేమని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తికే ఓటు వేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ సరైన అభ్యర్థికి ఓటు వేయాలని, డబ్బులకు ఓటు అమ్ముకోవద్దని విజయభాస్కర్ సూచించారు.

Latest Articles

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో నకిలీ అధికారి హల్‌చల్

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలంలో అనిరుధ్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. అధికారులు గందరగోళానికి గురి చేశాడు. తాను సీఎం పేషీ దూతగా పేర్కొంటూ..సీసీఎల్ ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేశారని బిల్డప్ ఇస్తూ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్