Gannavaram TDP Party Office: కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రికత్త చోటు చేసుకుంది. టీడీపీ ఆఫీసుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడి చేశారు. ఆఫీసు ఆవరణలోని కార్లు తగలబెట్టడంతో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వంశీ వర్గీయుల తీరుపై టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. వంశీపై ఫిర్యాదుచేసేందుకు టీడీపీ వర్గీయులు పోలీస్ స్టేషన్ కు భారీ ర్యాలీగా బయలుదేరారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పోలీసులే దగ్గరుండి తమ ఆఫీస్ పై దాడి చేయించారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాడికి నిరసనగా విజయవాడ-గన్నవరం(Gannavaram) జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు.