34.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబే కొన్నాడు: మంత్రి రోజా

RK Roja | ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచిన దగ్గర్నుంచి.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తూనే ఉన్నాడని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. కోట్ల రూపాయలు డబ్బులతో నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబే కొన్నాడని అన్నారు. వచ్చే ఎన్నికలలో 175-175 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల సీటు కాదు కదా.. పులివెందుల చెక్ పోస్ట్ తాకే దమ్ము, ధైర్యం ఉన్న మగాడు ఇంకా పుట్టలేదని అన్నారు. ఆ నలుగురూ డ్రాామాలు ఆడి ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు? అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనచ్చేమో కానీ.. కోట్లాది మంది జనాల గుండెల్లో జగన్‌పై ఉన్న అభిమానాన్ని కొనే దమ్ముందా అని చంద్రబాబును ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొని మాట్లాడారు.

మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు:
👉🏼పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వీడిన తయారు చేసే దమ్మున్న శక్తి, యుక్తి జగన్ మోహన్ రెడ్డికి ఉంది.
👉🏼గతంలో పార్టీలో గెలిచి అమ్ముడు పోయిన వ్యక్తులు సూసైడ్ చేసుకున్న రోజులను దృష్టిలో ఉంచుకోవాలి.
👉🏼అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎలా తిరుగుతారు.
👉🏼సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే.. ఓడిపోయినట్టు కాదు.
👉🏼రెట్టింపు బలంతో వేటాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.
👉🏼2024 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లకు 175 సీట్లు గెలవబోతుంది.
👉🏼పులివెందులలో గెలుస్తామంటున్నా పచ్చనేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నా.
👉🏼టీడీపీ, జనసేన పార్టీల నేతలు.. వై నాట్ పులివెందుల అని మాస్ డైలాగ్‌లు పేలుస్తున్నారు.
👉🏼తమతమ పార్టీల కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
👉🏼175 కాదు.. ముందు పులివెందులలో జగన్ గెలవాలి.
👉🏼ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైసీపీకి ఓటు వేశామని అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు డ్రామాలు ఆపాలి.
👉🏼పార్టీలో గానీ.. ప్రజల్లో గానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద గెలిచి వెన్నుపోటు పొడిచిన వారికి సానుభూతి దొరకదు.
👉🏼 ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు ఏ పోరాటం చేయలేదు.

Latest Articles

కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ, టీడీపీ మధ్య వర్గ పోరు

   కర్నూలు జిల్లా మంత్రాలయంలో బీజేపీ, టీడీపీ మధ్య వర్గ విబేధాలు బట్టబయలయ్యాయి. టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి బీజేపీ శ్రేణులను దూరం పెడుతూ.. అవమానప రుస్తున్నారని బహిరంగగానే విమర్శలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్