Site icon Swatantra Tv

హనుమకొండలో పట్టపగలే ఆటో డ్రైవర్‌ దారుణ హత్య

హనుమకొండలో దారుణం జరిగింది. ఒక ఆటో డ్రైవర్‌ని మరో ఆటో డ్రైవర్‌ దారుణంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి పరారయ్యడు.

చనిపోయిన వ్యక్తిని మడికొండకు చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించారు. ఇద్దరు ఆటోడ్రైవర్లు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటన సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డీమార్ట్‌ ఎదురుగా చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్‌ను మరో ఆటో డ్రైవర్‌ కత్తితో పొడిచాడు. అనంతరం అతను పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

హైదరాబాద్‌, హనుమకొండ రహదారిపై ఈ ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే ఆటో డ్రైవర్‌ రాజ్‌కుమార్‌పై కత్తితో దాడి చేశాడు. ఉదయం నుంచి ఆటోను ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. మృతుడి ఆటోకు అడ్డంగా తన ఆటో పెట్టి .. వెంట తెచ్చుకున్న కత్తితో రాజ్‌కుమార్‌ను దారుణంగా పొడిచి చంపేశాడు.

Exit mobile version