Site icon Swatantra Tv

నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట

నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలనే నిబంధనను కోర్టు మినహాయించింది. అలాగే విదేశాలకు వెళ్లేందుకు కూడా అనుమతించింది.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌ గతంలో ఆదేశించింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా దీనికి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్‌ కోర్టును కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం చిక్కపల్లి పోలీస్ స్టేషన్‌కు ప్రతి ఆదివారం హాజరుకావాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది.

Exit mobile version