Site icon Swatantra Tv

నేడు ఏపీలో కూటమి ఎమ్మెల్యేల సమావేశం

    విజయవాడలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరువుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సమావేశం జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్ను కోనున్నారు ఎమ్మెల్యేలు. సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపాదించే అవకాశం ఉంది. అనంతరం చంద్రబాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనంతరం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసి, తీర్మాన ప్రతిని అందించి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్న వరం దగ్గర కేసరపల్లిలోని ఐటీ పార్క్‌ దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధమవుతోంది. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Exit mobile version