Site icon Swatantra Tv

వైసీపీ హయాంలో వ్యవస్థలు అన్నీ విధ్వంసమయ్యాయి – చంద్రబాబు

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ.. రాష్ట్రంలో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్‌ నినాదంతో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్‌ రూపొందించామన్నారు. శాసనసభలో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. భద్రత లేకుంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారన్నారు.

గత ప్రభుత్వ అక్రమాలపై లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ హయాంలో వ్యవస్థలు విధ్వంసమయ్యాయని, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందన్నారు. అప్పులు పరాకాష్టకు చేరాయని చెప్పుకొచ్చారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చేయరని కామెంట్‌ చేశారు ఏపీ సీఎం. అసత్యాలను పదేపదే చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూశారన్నారు చంద్రబాబు.

1999లో విజన్ 2020 తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు. నాలెడ్జ్‌ ఎకానమీకి హైదరాబాద్‌ చిరునామాగా మారిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే భద్రత ఉండాలన్న ఆయన.. ప్రజలు సైతం దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. అదే సమయంలో వారికి చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు ముఖ్యమంత్రి.

2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌కు పిలుపునిచ్చారని.. తాము మాత్రం స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకెళ్తామని అన్నారు. నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్‌ తయారు చేయాలని సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు.

Exit mobile version