Site icon Swatantra Tv

ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి చేరిన వాయుకాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. ఢిల్లీ NCRలో గాలి నాణ్యత సూచి 500 మార్క్‌కు చేరింది. ఇవాళ ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 494గా నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. దేశ రాజధాని నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో కాలుష్యం పెరిగింది. ఉదయం పలు ఎయిర్‌ మానిటరింగ్‌ స్టేషన్లలో AQI లెవల్స్‌ 500 మార్క్‌ను తాకాయి. ఇది సివియర్‌ ప్లస్‌ కేటగిరీని సూచిస్తుంది. ద్వారకలో అత్యల్పంగా 480గా నమోదైంది.

నిన్న కూడా ఢిల్లీలో కాలుష్యం ఇదే స్థాయిలో నమోదైంది. రాజధానిలో విషపూరిత పొగమంచు కారణంగా విజిబులిటి పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాజధానికి రాకపోకలు సాగించే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరో తొమ్మిది రైళ్లను అధికారులు రద్దు చేశారు.

Exit mobile version