Site icon Swatantra Tv

నాంపల్లి కోర్టుకు హాజరైన ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి

   బీజేపీ నేత NVSS ప్రభాకర్‌ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు తాను ‘క్విడ్ ప్రో కో’కు పాల్పడ్డానంటూ గతంలో ప్రభాకర్ చేసిన ఆరోపణ లపై దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా వేశారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం పలువురు నేతలు ఆమెకు బెంజ్‌ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చారంటూ ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై దీపాదాస్ మున్షీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఇప్పటికే ఆమె లీగల్ నోటీసులు పంపించారు. ఆరోపణలపై ఆధారాలు చూపించాలని, లేకపోతే రూ.10కోట్ల పరువు నష్టం దావా వేస్తానని దీపాదాస్ మున్షీ హెచ్చరించారు. దీనిపై తాజాగా ఆమె నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మున్సీ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.

Exit mobile version