Site icon Swatantra Tv

ఏఐ అద్భుతం… రోబో టీచర్ ఆవిష్కరణ

   ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ రూమ్ లోకి దూసుకు వచ్చేసింది. దేశంలోనే తొలి కృత్రిమ మేథ రోబో టీచర్ ఐరిస్ కేరళ పాఠశాలలో పాఠాలు చెప్పడం ప్రారంభించింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ వింత చూడాల్సిందే.

అన్నిరంగాల్లోనూ వేగంగా దూసుకువస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యారంగంలోనూ ప్రవేశిం చింది. కేరళలోని తిరువనంతపురంలోని ఓ స్కూల్ లో రోబో టీచర్ ఐరిస్ రంగ ప్రవేశంతో విద్యార్థులు ఆశ్చర్యం ఆనందంతో పులకించిపోయారు. తొలి ఏఐ టీచర్ కదలివచ్చి .. తమకు షేక్ హ్యాండ్ ఇస్తూ.. పలకరించేటప్పడికి విద్యార్థులు ముగ్ధులయ్యారు. తిరువనంతపురం లోని పాఠశాలలో ఏఐ టీచర్ ఐరిస్ ను పరిచయం చేశారు. జనరేటివ్ ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మేకర్స్ ల్యాబ్ ఈ రోబో టీచర్ ను రూపొందించింది.

విద్యారంగంలో ఇది విప్లవమే. కేరళలోని కేటీసీటీ హయ్యర్ సెకెండరీ స్కూల్ లో రోబో టీచర్ ఆవిష్కరణ జరిగింది. తరగతి గదిలో రోబో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయింది. ఏఐ టీచర్ ఐరిస్ ను విఎస్ఎస్సీ స్పేస్ ఫిజిక్స్ లేబొరెటరీ డైరెక్టర్ డాక్టర్ కె రాజీవ్ ఆవిష్కరించారు. విద్యారంగంలో బోధనా ప్రక్రియకు కొత్త నిర్వచనం చెబుతూ, అన్ని హద్దులనూ చెరిపేస్తూ.. ఏఐ రోబో టీచర్.. విద్యాప్రమాణాలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. హోంవర్క్ ల గోల.. వేధింపుల బెడద ఉండదు. రోబో ఐరిస్ టీచర్ .. ద్వారా వ్యక్తిగత విద్యాబోధనకు అవకాశం ఉంటుంది. ప్రతివిద్యార్థి అవసరాలు, ప్రాధాన్యాతలకు అనుగుణంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రతిభావంతంగా పాఠాలు చెబుతుందంటు న్నారు రూపకల్పన చేసిన మేథావులు.

Exit mobile version