Site icon Swatantra Tv

ఆదిత్య ప్రాజెక్ట్ విజయ స్ఫూర్తి

      భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కిందటేడాది మరో అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. చంద్రయాన్ త్రీ విజయంతో స్ఫూర్తి పొంది ఆదిత్య ఎల్ -1 మిషన్‌ను తీర్చిదిద్దారు ఇస్రో సైంటిస్టులు. కిందటేడాది సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్ -1 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపించింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. సూర్యుడిపై అధ్యయనానికి ఉద్దేశించిన ఆదిత్య -ఎల్‌ 1 ప్రయోగం విజయవంతమైంది. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరాన ఉన్న లంగ్రాజ్ పాయింట్ దగ్గర ఉన్న హాలో కక్ష్యలోకి విజయవంతంగా ఆదిత్య -ఎల్‌ 1 స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రవేశిం చింది. ఇక్కడి నుంచి నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. సూర్యుడి గుట్టు విప్పడమే ఆదిత్య ఎల్‌ -1 స్పేస్‌క్రాఫ్ట్‌ అసలు లక్ష్యం.

     ఆదిత్య ఎల్ 1….భారతదేశపు తొలి సోలార్ మిషన్‌. ఒకవైపు చంద్రయాన్ త్రీ కి సంబంధించి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్ నుంచి అందుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూనే మరో వైపు ఆదిత్య ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టింది. సూర్యుడిని అలాగే సౌర మండ లంపై వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడమే ఆదిత్య ప్రయోగం ప్రధానోద్దేశం. ఆదిత్య ప్రయో గాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆదిత్య అంటే 1500 కిలోల బరువున్న శాటిలైట్.

    ఆదిత్య ఎల్‌ 1…భారతదేశ మొదటి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీ. ఆదిత్య ప్రయోగం అంటే చిన్నా చితకా విషయం కాదు.భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన ఉన్న లాగ్రాంజ్ పాయింట్ వన్‌ చుట్టూ ఉన్న సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ఆదిత్యను ప్రవేశ పెట్టడం. సూర్యుడి ఉపరితలంపై విపరీతమైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఉపరితలంపై ఉండే ప్లాస్మా పేలుళ్లు…ఈ ఉష్ణోగ్రతకు కారణం. ప్లాస్మా పేలుడు కారణంగా మిలియన్ల టన్నుల ప్లాస్మా అంతరిక్షంలోకి వ్యాపిస్తుంది. దీనినే స్పేస్ పరిభాషలో కరోనల్ మాస్ ఎజక్షన్ అంటారు. ఇది కాంతి వేగంతో వ్యాపిస్తుంది. అనేకసార్లు ఈ కరోనల్ మాస్ ఎజక్షన్, భూమి వైపునకు దూసుకువస్తుంటుంది. అయితే భూమి అయస్కాంత క్షేత్రం కారణంగా భూమికి చేరదు. అయితే కొన్నిసార్లు భూమి బయటి పొరల్లోకి చొచ్చుకుపోతుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆదిత్య ప్రయోగానికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పన్నెండు పేజీల బుక్‌లెట్‌ను విడుదల చేసింది.

     ఆదిత్య ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. ఇందులో విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ ప్రధానమైనది. దీంతో పాటు సోలార్ అల్ట్రావయెలెట్‌ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్ సహా మొత్తం ఏడు పేలోడ్‌లను అమర్చారు. ఈ పేలోడ్లను అమర్చడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని నిరంత రం అధ్యయనం చేయడానికి వీలుగా ఈ ఏడు పేలోడ్లను అమరుస్తారు.ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడి లోపలి పొరలైన ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, వెలుపల ఉండే కరోనా ను ఈ పేలోడ్లు అధ్యయనం చేస్తాయి. ప్రయోగంలో భాగంగా ఎల్ 1 ప్రదేశానికి ఉన్న సానుకూలతలను దృష్టిలో పెట్టుకుని నాలుగు పరికరాలు సూర్యుడిని అధ్యయనం చేస్తాయి. మిగతా మూడు సాధనాలు అక్కడకు సమీపానగల సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించి పరిశోధనలు చేస్తుం టాయి.

      సూర్యుని కరోనల్ మాస్ ఎజక్షన్ భూమి వైపు వచ్చినప్పుడు కక్ష్య చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహానికి చాలా నష్టం జరుగుతుంది. భూమిపై కూడా షార్ట్ వెబ్ కమ్యూనికేషన్‌కు ఆటంకం ఏర్పడుతుంది. అందుకే సూర్యుడి నుంచి వచ్చే కరోనల్ మాస్ ఎజక్షన్, దాని తీవ్రతను సమయానికి అంచనా వేయడానికి ఆదిత్య ఎల్‌ 1 ను సూర్యుడికి దగ్గరగా పంపారు. ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్రో సైంటిస్టులకు అభినం దనలు తెలిపారు. ‘భారతదేశపు మొట్టమొదటి సౌర మిషన్ అయిన ఆదిత్య-ఎల్1 ప్రయోగం భారతదేశ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త పథంలోకి తీసుకెళ్లే ఒక మైలురాయి సాధన. ఇది అంతరిక్షం అలాగే ఖగోళ విషయాలను బాగా అర్థం చేసుకోవడాని కి మనకు ఎంతగానో సాయపడుతుందన్నారు ద్రౌపది ముర్ము. మిషన్ విజయవంతం అయి నందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.

Exit mobile version