Site icon Swatantra Tv

Manchu Manoj |కాబోయే భార్య అంటూ ఫోటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌.. లగ్గం ఎప్పుడంటే..

Manchu-Manoj,-Mounika

Manchu Manoj |మంచు వారింట పెళ్లి సందడి కనిపిస్తోంది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోనున్నారు. మార్చి౩వ తేదీ రాత్రి భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడగులు వేయబోతున్నారు. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించి ప్రచారం జరుగుతుండగా.. దీనిపై వీరిద్దరు ఎక్కడా స్పందించలేదు. అలాగే తమ పెళ్లి గురించి ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా తన పెళ్లిపై అధికారిక ప్రకటన ఇచ్చాడు మనోజ్. ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. కొత్త పెళ్లి కూతురిగా ముస్తాబైన మౌనిక ఫోటోను షేర్ చేస్తూ.. ఎం వెడ్స్ ఎం.. మనోజ్ వెడ్స్ మౌనిక.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.  మంచు మనోజ్ వివాహం తన సోదరి మంచు లక్ష్మి ఇంట శుక్రవారం రాత్రి 8గంటల 30 నిమిషాలకు కొద్దిమంది కుటుంబసభ్యులు.. అతి కొద్ది మంది సన్నిహితులు, రాజకీయ ప్రముఖుల మధ్య వీరి పెళ్లి వేడుక జరగనుంది.

మంచు మనోజ్(Manchu Manoj), మౌనికా రెడ్డి(Mounika Reddy) ఇద్దరికీ కూడా ఇది రెండో వివాహం . మొదటి భార్యతో విడాకులు తీసుకున్న మనోజ్..భూమా మౌనిక రెడ్డితో చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వీరి వివాహం గురించి అనేకసార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

మనోజ్‌, మౌనిక సన్నిహితంగా మెలగడంతో వీరిద్దరూ ఒకటికాబోతున్నారనే వార్తలు గతంలో వచ్చాయి. అయితే అటు భూమా కుటుంబం కాని.. మంచు ఫ్యామిలి కాని వారిద్దరి స్నేహం గురించి అధికారికంగా స్పందించలేదు. అయితే కొద్దిరోజులుగా మాత్రం వీరిద్దరూ ఒకటి కాబోతున్నారని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇవాల్టి అధికారిక ప్రకటనతో మనోజ్‌.. మౌనికా పెళ్లిపై క్లారిటీ వచ్చింది.

Read Also: టీజర్ అదుర్స్.. హిట్ గ్యారంటీనా?

Follow us on:    Youtube   Instagram

Exit mobile version