Site icon Swatantra Tv

Ajith Kumar |ఆ స్టార్ హీరో ఇంట విషాదం.. సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి

Ajith Kumar |కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యం కారణంగా శుక్రవారం కన్నుమూశారు. ఆయ వయసు 84 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అజిత్ తండ్రి సుబ్రమణ్యం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్‌ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. సుబ్రమణ్యం ఆత్మకు శాంతి చేకూరాలంటూ అజిత్‌ అభిమానులు సామాజిక మాద్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. సుబ్రమణ్యం కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మలయాళీ. ఆయన భార్య మోహినీ. ఈ దంపతులకు అజిత్‌ కుమార్‌తో పాటు అనుప్ కుమార్, అనిల్ కుమార్ మొత్తం ముగ్గురు కుమారులున్నారు. కాగా అజిత్‌, ఆయన భార్య షాలిని, పిల్లలందరూ ప్రస్తుతం యూరప్‌ వేకేషన్‌లో ఉన్నారు. తన తండ్రి మరణ వార్త విని ఇప్పటికే చెన్నైకు పయనమయ్యారు అజిత్.

ఇవాళ సాయంత్రం చెన్నైలో బీసెంట్‌ నగర్‌లోని శ్మశాన వాటికలో అజిత్‌(Ajith Kumar) తండ్రి అంత్యక్రియలు జరగనున్నాయి. సుబ్రమణ్యం పక్షవాతంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకోసం చికిత్స కూడా తీసుకుంటున్నాడు. అయితే శుక్రవారం తన ఇంట్లోనే ఆయన కన్నుమూశాడు.

 Read Also:  అక్షయ్ కుమార్ కు తప్పిన ప్రమాదం.. ఆ సినిమా షూటింగ్ లో గాయాలు..

Follow us on:   Youtube   Instagram

Exit mobile version