Site icon Swatantra Tv

దక్షిణ పోర్చుగల్‌లో ఎయిర్‌ షోలో ప్రమాదం

   దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో ప్రమాదం చోటుచేసుకుంది. విన్యాసాలు ప్రదర్శిస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పైలట్‌ మృతిచెందగా, మరో పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారు. బెజాలో నిన్న జరుగుతున్న ఎయిర్‌షోలో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఆరు విమానాలు విన్యాసాలు ప్రదర్శిస్తుండగా ఒకటి వేగంగా, పైకి దూసుకెళ్లి మరోదాన్ని ఢీకొట్టింది. దీంతో రెండూ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒకటి ఎయిర్‌బేస్‌కు ఆవలపడగా మరొకటి సమీపంలో కుప్పకూ లింది. విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చు గల్‌ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు. పోర్చుగల్‌, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన యాక్‌ స్టార్స్ అనే ఏరోబాటిక్‌ గ్రూప్‌ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లెవ్ యాక్-52 రకానికి చెందినవి. మరణించిన పైలట్‌ స్పెయిన్‌కు చెందిన వ్యక్తి కాగా, గాయపడిన పైలట్‌ పోర్చుగల్‌ పౌరుడు. ప్రమాదానికి సంబంధిం చిన దృశ్యాలను ఓ వీక్షకుడు తన కెమెరాలో బంధించి ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా అది వైరలవుతోంది.

Exit mobile version