Site icon Swatantra Tv

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

     తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు, గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు. గట్టు మల్లు గతంలో SIBలో సీఐగా పని చేశారు. SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేశారు. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరు పతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగియ గా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న వేళ…డీజీపీ రవిగుప్తాను కలిసి మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ అధినేతపై ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో వార్‌రూం ఉందని ఆరోపి స్తూ తనిఖీలు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు డిమాండ్‌ చేశారని.. ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలు బయటపెట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏసీబీ, ఈడీ ద్వారా దర్యాప్తు చేయాలని కోరారు బండి సుధాకర్‌, సమ్మిరెడ్డితోపాటు పలువురు నేతలు.

Exit mobile version