ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.ఇక ఈ జీవో ప్రకారం.. దేవదాయ కమిషనర్ సహా ఏ స్ఖాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది.. పూజలు, సేవలు, యాగాలు, కుంభాభిషేకాల వంటి వాటిల్లో అధికారుల పాత్రని పరిమితంగానే ఉంటుందని.. ఆలయాల ఆగమ శాస్త్రాల ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేందుకు అర్చకులకు వెసులుబాటు లభిస్తుందని తెలిపారు.. ఆధ్యాత్మిక విధుల విషయంలో ఏ విషయంలో అయినా సరే ఫైనల్ డెసిషన్ తీసుకునే పవర్ అర్చకులకే ఉంటుందని తేల్చి చెప్పారు.. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చునని.. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవచ్చని స్పష్టంచేసింది ఏపీ సర్కారు.