Site icon Swatantra Tv

మద్దిపాడు పీఎస్‌లో ఆర్జీవీపై కేసు నమోదు

సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్‌కు వచ్చారు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్‌ సమయంలో.. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు సిద్ధం చేశారు. వ్యక్తిగతంగా వాటిని అందజేసేందుకు ఎస్సై శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరింది. బుధవారం నోటీసులు అందజేసే అవకాశం ఉంది. ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్‌.శ్రీకాంత్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

Exit mobile version