Site icon Swatantra Tv

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్‌ పిలుపు

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బంద్‌కు హిందూ ధర్మ ప్రచార సమితి కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హబ్సిగూడలో హిందూ ధర్మ ప్రచార సమితి తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సమితి సభ్యులు మాట్లాడారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, అకృత్యాలు, నరమేధానికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులు మనోధర్యం కోల్పోకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మద్దతు ప్రకటించాలని ధర్మ ప్రచార సమితి కమిటీ సభ్యులు కోరారు.

Exit mobile version