Site icon Swatantra Tv

స్వచ్ఛ సర్వేక్షణ్ లో 6 ర్యాంకుల్లో 4 మనవే: కేటీఆర్

swachh survekshan Ranks

Swachh Survekshan Ranks |దేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కింద 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే అందులో 4 జిల్లాలు తెలంగాణకు చెందినవేనని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిద్దిన ఘనత కేసీఆర్ దేనని గుర్తు చేశారు. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్​లు పెంచామని చెప్పారు.మహబూబాబాద్ జిల్లాలో 20,000 మంది మహిళలతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే దేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తింపు తెచ్చుకున్నారని మంత్రి ప్రశంసించారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజనలో రాష్ట్రానికి తగిన గుర్తింపు వచ్చిందని అన్నారు. చక్కని పనితీరు కనబర్చిన 20 గ్రామాల్లో.. 19 గ్రామాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని అభివర్ణించారు. తక్కువ కాలంలో దేశంలోనే తెెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామని అన్నారు.

Read Also: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం

Follow us on:   Youtube   Instagram

Exit mobile version