Site icon Swatantra Tv

30ఏళ్లుగా వర్గీకరణ పోరాటం నేటికి సాకారమైంది – డొక్కా మాణిక్య వరప్రసాద్

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మక తీర్పు అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఎన్నో ఎళ్ల పోరాటమని… 30 ఏళ్ల వర్గీకరణ పోరాటం నేటికి సాకారమైందని తెలిపారు. సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు కోసం దేశంలో అన్ని పార్టీల మద్దతు ఇస్తే… వైసీపీ మాత్రం వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర వహించటం వల్లనే విజయం సాధించామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును యధాతథంగా రాష్ట్రాలు అమలు చేయాలని కోరారు. వైసీపీ మాత్రం వర్గీకరణ ఉద్యమ విషయంలో ఎలాంటి కీలకపాత్ర పోషించకపోగా.. అణగదొక్కాలని చూడటం బాధాకరమని తెలిపారు.

Exit mobile version