Site icon Swatantra Tv

పేదలకు గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలి- సీపీఐ

పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. అనంతపురం ఆర్డీఓ ఆఫీసు వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటి స్థలాల కోసం లక్షల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్‌ తెలిపారు. కానీ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ 75 వేల అప్లికేషన్లు వచ్చాయని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. వైసీపీ హయాంలో ఆన్‌లైన్‌లో ఉన్న లబ్ధిదారుల వివరాలను డిలీట్ చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో లబ్ధిదారులు ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేస్తారని చెప్పారు. పేదల ప్రభుత్వంగా చెప్పుకునే కూటమి సర్కార్‌ లబ్ధిదారులకు న్యాయం చేయాలని జగదీష్‌ డిమాండ్ చేశారు.

Exit mobile version