Site icon Swatantra Tv

2018 డైరెక్టర్‌తో లైకా ప్రొడక్షన్స్ కొత్త సినిమా..

స్వతంత్ర వెబ్ డెస్క్: సినీ ప్రేమికులకు ఎప్ప‌టిక‌ప్పుడు భారీ చిత్రాలును .. విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌నే కాదు.. వైవిధ్య‌మైన కాన్సెప్ట్ మూవీస్‌ను కూడా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ అందిస్తోంది. ఓ వైపు స్టార్ హీరోలు, ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేస్తూనే, యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టంలో ఈ సంస్థ ఎప్పుడూ ముందుంటోంది. లైకా త‌మ బ్యాన‌ర్‌లో కొత్త సినిమాను రూపొందించ‌నున్న‌ట్లు తాజాగా అధికారిక ప్ర‌క‌ట‌న‌న‌ను విడుద‌ల చేసింది. లైకా బ్యానర్లో ఆ సినిమాను డైరెక్ట్ చేయ‌బోయేదెవ‌రో కాదు.. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్ట‌ర్ జూడ్ ఆంథోని జోసెఫ్‌. రియ‌ల్ కాన్సెప్ట్‌తో ‘2018’ వంటి ఓ విభిన్న‌మైన సినిమాను తెర‌కెక్కించిన ఆంథోని జోసెఫ్ అంద‌రి ప్రశంసలను అందుకున్నారు. మ‌ల‌యాళంలో సంచ‌ల‌నాలు సృష్టించిన సినిమా ‘2018’. సాధార‌ణ సినిమాగా మొద‌లై… వంద కోట్ల మైలురాయిని అధిగ‌మించింది.

కేర‌ళ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో రూపొంద‌డం.. అక్క‌డి ప్ర‌జ‌లంద‌రికీ క‌నెక్ట్ కావ‌డ‌మే అందుకు కార‌ణం. భాష‌ల మ‌ధ్య హ‌ద్దులు చెరిగిపోవ‌డంతో ఏ భాష‌లో మంచి సినిమా వ‌చ్చినా… వెంట‌నే అవి తెలుగులోనూ విడుదలవుతుంటాయి. అలా విడుద‌లై నెల రోజుల తిరగ‌క‌ముందే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న మ‌రో అనువాద చిత్ర‌మే ఇది. 2018లో కేర‌ళ‌లో వర‌ద బీభ‌త్సాన్ని ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. ఆ వాస్తవ ఘ‌ట‌నను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించిన ఆంథోని జోసెఫ్ .. మ‌రో డిఫ‌రెంట్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి రెడీ అయ్యారు. ఈసారి ఆయ‌న‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ చేతులు క‌లిపింది. ప్రేక్ష‌కుల‌ను అంచ‌నాల‌ను మించేలా ఓ మెస్మ‌రైజింగ్ మూవీతో రాబోతున్నట్టు తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చెప్పింది.

Exit mobile version