Site icon Swatantra Tv

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

Tirumala | ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. గురువారం 65,910 మంది భక్తులు వైకుంఠవాసుడిని దర్శించుకున్నారు. 27,838 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా, గురువారం స్వామివారి హుండీ ఆదాయం రూ.2.80 కోట్ల వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

Exit mobile version