అంగరంగ వైభవంగా స్వామి కళ్యాణం
రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఘనంగా జరిగాయి. స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. అనువంశిక ధర్మకర్తల పర్యవేక్షణలో వేద పండితులు కళ్యాణ తంతును పూర్తి చేసారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు ఎదుర్కోలు, కళ్యాణ మహో త్సవాలను తిలకించి తరించారు.
మినీ బ్రహ్మోత్సవాలకు సిద్దం
మినీ బ్రహ్మోత్సవాలకు తిరుమల సన్నద్ధమైంది. 16వ తేదీ రధసప్తమి వేళ శ్రీ మలయప్పస్వామి ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ మాడవీధుల్లో పలు వాహన సేవలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. మధ్యాహ్నం చక్ర స్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా 15న తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శన, టైంస్లాట్ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.
ఉత్తర కుమారుని పలుకులు
ఐదేళ్లలో రాజధాని నిర్మించలేని వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ G V L నరసిం హారావు. మూడు రాజధానులంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు నాల్గోదిగా హైదరాబాద్‌ను తెరపైకి తేవడం ఎన్నిక ల్లో లబ్ది కోసం ఆడుతున్న కొత్త ఎత్తుగడగా పేర్కొన్నారు. ఏపీ రాజధానిగా అమరావతి అభివృద్ధి జరగాలి…ఆత్మ నిర్భర్ ఏపీ కావాల న్నారు జీవీఎల్.
శ్రీశైలంలో చిరుత కలకలం
నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెడ్ల సత్రం వద్ద చిరుతను చూసిన భక్తులు, స్థానికులు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో రాత్రుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని భక్తులకు, స్థానికులకు విజ్ఞప్తి చేసారు అధికారులు.
నేటితో గడువు లాస్ట్
తెలంగాణలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్స్ కు నేటితో గడువు ముగియనుంది. చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా ముందే చలాన్స్ చెల్లించాలని ట్రాఫిక్ విభాగం అధికారులు పేర్కొన్నారు. మరో సారి గడువు పెంచే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేసారు.
డ్రైవర్ రహిత మెట్రో రైలు
డ్రైవర్ రహిత మెట్రో రైలు బెంగళూరుకు చేరింది. త్వరలో ట్రయల్ రన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరు కోచ్‌లు కలిగిన తొలి రైలు చైనా నుంచి బెంగళూరుకు చేరుకున్నట్లు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ వెల్లడిం చింది. ఎల్లో లైన్‌లో ఆర్‌వీ రోడ్డు నుంచి సిల్క్ బోర్డు మీదుగా ఎలక్ర్టాని్ సిటీ వరకు ఈ రైలు నడవనుంది.
‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ
సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్‌కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం సాయంత్రం విజయవాడ A 1 కన్వెన్షన్ సెంటరలో జరగనుంది. పుస్తకావిష్కరణ కార్యక్రమంకు ముఖ్యఅతిధులుగా టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హజరుకానున్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై 185 అంశాలతో ఈ పుస్తకాన్ని రూపొందించారు సురేష్.
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రజలకు ముందుకొచ్చింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ ప్రకటించారు. ఐక్యతా విజయపథం పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన విజయ కుమార్ గుంటూరులో జరిగిన అధిక జన మహా సంకల్ప సభ వేదికగా పార్టీ పేరును ప్రకటిం చారు.
సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్‌లోని సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. మహాలక్ష్మీ పధకంతో పెరిగిన ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఎక్కువమంది ప్రయాణించేలా కొన్ని సీట్లను తొలగించి ఈ తరహా సీటింగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని రూట్లలో ఈ రకంగా సీట్ల సీటింగ్‌ను మార్చి ప్రయోగా త్మకంగా అమలు చేస్తోంది.
సేవాలాల్‌కు నివాళి !
బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లి లోని తన నివాసంలో సేవాలాల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్ర మంలో పలువురుపార్టీ నేతలు పాల్గొన్నారు.
కారు ఢీ – వ్యక్తి మృతి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ శివారెడ్డిగూడ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొనడంతో రాంపల్లికి చెందిన 32 ఏళ్ల ప్రశాంత్ మృతి చెందాడు. శ్రీకాంత్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘట్కేసర్ నుండి రాంపల్లి కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహేతర సంబంధం ….హత్య
గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో రామిశెట్టి అలేఖ్య అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. భవనం వారి వీదిలో నివాసం ఉంటున్న అలేఖ్యను గొంతు కోసి దుండగులు హత్య చేసారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది. టుటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
రామగిరి మహేందర్ హత్య…. నిందితుల అరెస్ట్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్ హత్య కేసులో నలు గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొన్నారం గ్రామానికి చెందిన బట్టే పద్మ, బట్టే శేఖర్‌తో పాటు కమ్మరి పల్లి గ్రామానికి చెందిన మొగిలి, సుగుణ ను అరెస్టు చేసారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ నలుగురు కలసి మహేందర్‌ను హత్య చేసినట్లు పోలీసులు డీసీపీ తెలిపారు.