Site icon Swatantra Tv

సోమాలియా తీరంలో మరో నౌక హైజాక్ !

          సోమాలియా అంటేనే సముద్ర దొంగలకు ఆలవాలం.  హిందూ మహాసముద్రం సోమాలియా తీరంలో మరో నౌక హైజాక్ కు గురైంది. హిందూ మహాసముద్రంలోని సోమాలియా తీరంలో లైబీరియా జెండాతో ఉన్న నౌక హైజాక్ అయిం ది. దాదాపు ఇందులో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ హైజాక్ గురించి యూకే మారిటైమ్ ఏజెన్సీకి చెందిన నౌక సందేశం పంపింది. ఈ సందేశంలో సత్వరమే స్పందించిన భారత నౌకాదళం , నౌక వెళ్లిన మార్గాన్ని సాంకేతికంగా పరిశీలించింది. సముద్ర తీర గస్తీకి ఏర్పాటు చేసిన ఐఎన్ఎస్ చెన్నై ను రంగంలోకి దించింది. వీరితోపాటు ఎయిర్ క్రాఫ్ట్ ను పంపింది. అయితే నౌకలోని సిబ్బందితో కమ్యునికేషన్ చేయడం వీలుపడిందని అధికారులు చెప్పారు. నౌకా సిబ్బంది సురక్షితంగా ఉన్నట్టు వెల్లిడించారు.

       ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ – హమాస్ ల మధ్య యుద్దం జరగుతున్న తరుణంలో ఎర్ర సముద్రంలో నౌకలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల హిందూ మహా సముద్రంలో నౌకల హైజాక్ సంఘటనలు విరివిగా జరుగుతున్నా యి. కొద్ది రోజుల క్రితం భారత్ వస్తోన్న ఒక వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. వెను వెంటనే సమా చారం అందుకున్న భారత నేవీ ఐసీజీఎస్ విక్రమ్ ను రంగంలోకి దించి, సహాయక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిం దే. ఆ ప్రమాదం నుండి దాదాపు 20 మంది భారతీయులతోపాటు నౌక సిబ్బంది సురక్షితంగా బయట డినట్టు అప్పటి నౌకా దళం ప్రకటించింది.

Exit mobile version