ఆదర్శ కుటుంబం చూసేందుకు ఈనెల 30న మల్లారెడ్డి వర్సిటీ విద్యార్థులకు సెలవు ప్రకటించడంపై విమర్శలొస్తున్నాయి. పేరెంట్స్ తమ పిల్లల్ని సినిమాల కోసం కాలేజీకి పంపిస్తున్నారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాలేజీల్లో మూవీ ఈవెంట్లు పెడుతూ విద్యార్థుల టైమ్ వేస్ట్ చేస్తున్నారని, దీనిపై CM రేవంత్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ‘టాక్సిక్’ ఈవెంట్‌లో ప్రమాదం జరగడాన్ని గుర్తుచేస్తున్నారు.
ఎంతో కష్టపడి తమ పిల్లల భవిష్యత్తు పూలబాట అయ్యేందుకు కాలేజీకి పంపిస్తుంటే… కాలేజీల్లో చదువు చెప్పడం మానేసి.. సినిమా ఫంక్షన్లు పెడుతున్నారని కొందరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో చదువు, ఆటల వరకు అయితే ఓకే.. మానసికంగా ధృడంగా ఉండటానికి ఆటలు అయితే ఓకే.. కానీ సినిమా ఈవెంట్లు పెట్టడం… సినిమా రిలీజ్‌కు సెలవులు ఇవ్వడం అనేది చాలా దారుణమనే టాక్ వినిపిస్తుంది. నానా కష్టాలు పడి ఫీజులు, పుస్తకాలు కొని పిల్లలను కాలేజీకి పంపిస్తే.. అక్కడ సినిమాలు చూడటానికి ఏకంగా హాలీడెస్ ఇచ్చి.. టికెట్లు కొని సినిమాలు పొమనడం ఏంటని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కొందరు ఘాటుగా కోరుతున్నారు.
కాలేజీల్లో సినిమా ఈవెంట్లు పెట్టడంపై కూడా చాలా మంది గుర్రుగా ఉన్నారు. చదవులు, దానికి సంబంధించిన ఈవెంట్లు పెడితే బాగుంటుందని అనుకుంటున్నారు. ప్రయోగాలకు నిలయంగా నిలవాల్సిన కళాశాలల్లో.. మూవీ పంక్షన్లు పెట్టడం ఏంటనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. చదువులు చెప్పి ప్రపంచ దేశాల్లో తమ విద్యార్థుల ఖ్యాతిని పెంచాల్సిన.. వర్సిటీల్లో.. సినిమా ఈవెంట్లు నిర్వహించడం సరికాదంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఉన్నత స్థానాలకు మెట్లు వేయాల్సిన కళాశాలలో.. ఎంటర్‌టైన్ చేయడాన్ని తీవ్రంగా తప్పుడుతున్నారు.
మానసిక ఉల్లసం పేరుతో సినిమాలను చూడమనడం సరికాదని.. ఆ ప్లేస్‌లో పుస్తకాలు చదవమనడం బెటర్ అని చెబుతున్నారు. ఆ ఈవెంట్ బదులు ఏ బుక్ ఫెయిరో నిర్వహిస్తే స్టూడెంట్స్‌కు ఎంతో మేలు జరగుతుందంటున్నారు. అంతే కాకుండా సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారితో ఇంటారాక్ట్ ప్రొగ్రాంలు పెట్టినా చాలా బాగుంటుందని అనుకుంటున్నారు. మల్లారెడ్డి వర్సిటీ యాజమాన్యం.. లెక్చరర్లు కూడా పిల్లలను చదువుకు ఎంకరేజ్ చేయాలని.. మంచి విద్యను బోధించి.. విద్యార్థుల ఉన్నతికి కృషి చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.


