Site icon Swatantra Tv

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ లైఫ్ లో సెన్సార్ క్వీన్

       రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక మిస్టరీగా ఉంటుంది. 71 ఏళ్ల పుతిన్‌.. తన వ్యక్తి గత జీవితానికి సంబంధించిన విషయాలను బయట ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. అయతే తాజాగా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తనకంటే 32 ఏళ్ల‌ చిన్న వయస్సు గల ఎకటెరినా మిజులినాతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తోంది. 39 ఏళ్ల ఎకటెరినా మిజులినాతో పుతిన్‌ ప్రేమాయాణం కొనసాగిస్తున్నారని న్యూయార్క్‌ పోస్ట్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఎకటెరినా మిజులినా ఒక చరిత్రకారిణి. రష్యా అనుకూల సేఫ్‌ ఇంటర్‌నెట్‌ లీగ్‌ సంస్థకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను సెన్సార్‌ చేస్తూ ఉంటుంది. రష్యాకు వ్యతిరేకంగా ఆన్‌లైన్‌ వ్యాపించే వ్యతిరేకమైన కంటెంట్‌ను నిషేధిస్తుంది. ఎకటెరినా మిజులినా.. 69 ఏళ్ల సెనేటర్ ఎలెనా మిజులినా కుమార్తె. ఎలెనా మిజులినాకు అధ్యక్షుడు పుతిన్‌ బలమైన మద్దతుదారు అనే పేరుంది. మిజులినా.. 2004లో లండన్ విశ్వవిద్యాలయం కళా చరిత్ర, ఇండోనేషియా భాషలో పట్టభద్రులయ్యారు. 2017లో సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌లో చేరడానికి ముందు చైనాను సందర్శించే అధికారిక రష్యన్ ప్రతినిధుల బృందానికి అనువాదకురాలిగా పనిచేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఓ రహస్య ప్రేయసి ఉందని, ఆమె పేరు అలీనా కబయేవా అని, ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో ఆమె అజ్ఞాతంలో ఉందనే టాపిక్‌ నడిచింది. అలీనా కబయేవా.. గతంలో జిమ్నాస్ట్‌గా ఉండేది. 30 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2014లో పుతిన్‌ భార్య లియుడ్మిలాకు విడాకులు ఇచ్చారు. పుతిన్‌ విడాకుల తర్వాత ఆయనతో చనువుగా ఉంటోంది. ఆపై మీడియా మేనేజర్‌గా.. ప్రస్తుతం రష్యా రాజకీయాల్లోనూ ఆమె తన మార్క్‌ చూపిస్తోందని వార్తలు వచ్చాయి.

Exit mobile version